ధర్మం చెయ్యండి అయ్యా .. మా పంచాయితీని ఆదుకొండయ్యా.. !
ధర్మం చెయ్యండి అయ్యా .. మా పంచాయితీని ఆదుకొండయ్యా అంటూ సర్పంచ్ లో బొచ్చలు పట్టుకుని భిక్షాటన చేస్తున్నారు. గతంలో పంచాయితీ సర్పంచ్ల, కార్యదర్శలు హక్కులను హరించే జీవో నెంబర్ 2 తీసుకొచ్చి .. హైకోర్టుతో మొట్టికాయాలు వేయించుకున్న ప్రభుత్వానికి ఇంకా సిగ్గుపెట్టలేదు దేవుడు. రాష్ట్రంలో ఉన్న 21,843 గ్రామ పంచాయితీలు గడిచిన 8 నెలల తీవ్ర నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. 14,15వ పంచవర్ష ప్రణాళిక సంఘం నిధులను ఒక్కరూపాయి కూడా గ్రామ పంచాయితీలకు ఇవ్వకుండా రూ. 3 వేల కోట్లను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని సొంతపార్టీకి చెందిన సర్పంచ్‌లే రగిలిపోయారు. సచివాలయాల నిర్వహణ ఖర్చు, శానిటేషన్, తాగునీటి పథకాల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్తు బిల్లులు వంటివాటికి సర్పంచ్ లే ఇప్పటి వరకు అప్పులు చేసి మరి సర్దుకుంటూ వస్తున్నారు. అలా ప్రభుత్వానికి, అధికారపార్టీకి సపోర్ట్ గా ఉంటే .. పంచాయితీలకు వినియోగించే నిధులను కూడా వాడేసుని పంచాయితీలను అడుక్కు తినేలా చేస్తారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని పలు గ్రామ పంచాయితీ సర్పంచ్ లు బొచ్చలు పట్టుకుని భిక్షాటన చేశారు. గ్రామ పంచాయితీ ఖాతాల్లో వేసిన నగదును కూడా ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకొందని సర్పంచ్ లు వాపోయ్యారు.
ఓహో.. ఏకగ్రీవాలు అందుకేనా?
స్థానిక సంస్థ ఎన్నికలంటే చాలు .. అధికారపార్టీకి ఓటమి భయం పట్టుకొని ప్రతిపక్షాన్ని భయపెట్టి, ప్రలోభపెట్టి, బెదించి ఏకగ్రీవాలకు తెరతీసిద్ది. నియోజకవర్గాలకు టార్గెట్ పెట్టి మరి ప్రజాభిప్రాయంతో పనిలేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఏకగ్రీవాల క్రీడను ప్రోత్సహించింది. అందరూ మనవాళ్లైతే నిధులను ఎలా మరిలించిన పర్వాలేదు .. అడిగేవారెవ్వరూ అని భ్రమ పడ్డాడు జగన్ రెడ్డి. రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు చేసి ప్రజలు మావైపు ఉన్నారు. 97 మార్కులు ఇచ్చారు కాబట్టే పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుందని ట్విట్టర్ పిట్టకు చెబుతాడు. పథకాలు పూర్తి స్థాయి అందిస్తూ .. నవరత్నాలను రాశులుగా పోసి పంచే మీకు ఈ ఓటమి భయమేమిటి నాన్సెన్ కాకపోతే! అంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి, ఆయన పక్కనుండి సలహాలిచ్చే సన్నాసులు కూడా ఊహించి ఉండరు… సొంతపార్టీ సర్పంచ్ లే .. అది సొంత జిల్లాలో ఒక రేంజ్ లో జలక్కిస్తారని. మైదుకూరు నియోజకవర్గంలో ఖాజీపేట మండల పరిథిలోని 13 గ్రామ పంచాయితీ సర్పంచ్ లు పదవులకు, పార్టీ శాశ్వస సభ్యత్వానికి రాజీనామా చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఇలా జగన్ రెడ్డి నియంతృత్వ పొకడలకు సొంతపార్టీవారే బలైపోతున్నారు. ప్రతిపక్షం కన్నా ఎక్కువగా తిరగబడి .. అవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీలను చక్కదిద్దాల్సిన మంత్రి శాఖలోని లోపలను కవర్ చేస్తూ .. ‘మూడు రాజధానుల రద్దు విషయంలో ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే.. సినీమా ఇంకా ఉందని సంకేతానిస్తాడు’ కానీ రోడ్డెక్కిన పంచాయితీ గౌరవంతో జగన్ రెడ్డి కథ క్లైమాక్స్ వచ్చిందని ఆ ‘పేద’రెడ్డికి తెలియదు కాబోలు ..! ఇక రేపటి నుంచి చూడు ఇసుక పంచాయితీల రెడ్డి గ్రామస్వరాజ్యం.. వీధుల్లో కేకలు పెట్టకుంటూ వైఫల్యాలను రోడ్డుకు తీసుకురాకపోతే ఒట్టు!











