జగన్ పాదయాత్రలో గురుమూర్తి కీ -రోల్!
ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రెడ్డి వెంటే ఉండి, ఆయన యోగక్షేమాలను, ఆరోగ్యాన్ని పరిరక్షించాడు తిరుపతి ఎంపీ గురుమూర్తి. వృతిరీత్యా వైద్యుడు, ఫిజియోథెరిఫిస్ట్ అయిన గురుమూర్తి కాలు బెణికి బాధపడుతున్న సీపీఐ నారాయణకు చికిత్స చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప, అనంతపురం, నెల్లూరు తోపాటు చిత్తూరు జిల్లాలో కూడా భారీ వరదలు ముంచెత్తాయి. అంతేకాక ప్రమాదకర స్థాయిలో ఉన్న రాయల చెరువు ఉందని, అది కోతకు గురై గండి పడబోతోందని తెలియడంతో దానిని పరిశీలించేందుకు సీపీఐ నారాయణ, వైసీపీ నేతలు చెరువు వద్దకు వచ్చారు. ఈ క్రమంలో నారాయణ కాలికి గాయమైంది. ఆ సమయంలో దగ్గరగా ఉన్న గురుమూర్తి ఆయన వైద్యం అందించారు.
Must Read ;- వేడుకలు.. వినోదాలు తప్ప విషాదాలు పట్టవా!











