భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కుంజా బొజ్జి భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985,1989,1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలుపొందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. చివరి రోజుల్లో ఆయన బిడ్డల దగ్గరే ఉన్నారు. తనకు వచ్చే ఫించన్ డబ్బులతోనే ఆయన జీవనం సాగించారు. ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసే ఆయనకు ఏజెన్సీ సుందరయ్య అని పేరుంది. పలువురు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.
Must Read ;- హిందూపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత