బిగ్ బాస్ సీజన్ 4 ముహూర్తం సిద్ధమైపోయింది. బుల్లితెరపై ఈ కార్యక్రమానికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 6 సాయంత్రం 6 గంటల నుంచి `స్టార్ మా`లో `బిగ్‌బాస్-4` ప్రసారమవుతుంది. దీనికి సంబంధించి ఛానెల్ యాజమాన్యం ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. మూడో సీజన్‌ను హోస్ట్ చేసిన నాగార్జున ఈ నాలుగో సీజన్‌ను కూడా హోస్ట్ చేస్తారు. ఈ సీజన్లో పాల్గొనేవారికి కోవిడ్-19 పరీక్షలు చేసి వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. కార్యక్రమం ప్రారంభం కాబోయే ముందు మరోసారి పరీక్షలు చేసి వారంతా పూర్తి అరోగ్యంగా ఉన్నారని తేలితేనే బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తారట. ఈ సీజన్ 10వారాలు మాత్రమే కొనసాగుతుందని తెలుస్తోంది.
Keep your TV Remote Ready for Entertainment Like Never Before!!! #WhatAWowWow 👁️#BiggBossTelugu4 Premieres September 6th at 6 PM on @StarMaa pic.twitter.com/5bbL4TsEjT
— Starmaa (@StarMaa) August 27, 2020











