వికారాబాద్ జిల్లాలో వింతరోగం కలకలం రేగింది. కానీ ఈ సారి వింతరోగ బాధితులు పక్షులు కావడం గమనార్హం. వికారాబాద్‌లోని ధారూర్ మండలం, దోర్నాల్ గ్రామంలో అంతుపట్టని వ్యాధిలో వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మరణిస్తున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు వాటి గురించిన వివారాలు సేకరిస్తున్నారు. గ్రామం దగ్గరలోనే జంతు కలేబరాలతో ఆయిల్ తయారీ కంపెనీ ఉంది. దీంతో స్థానికులు ఆ ఆయిల్ కంపెనీ వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. వివరాలు సేకరించిన అధికారులు పక్షుల మరణాలకి గల కారణాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాధమికంగా నిర్ధారణ జరిగితే తప్ప, పక్షుల మరణాలకు గల కారణాలు వివరించలేమంటున్నారు అధికారులు.
Must Read ;- వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం.. కారణం ఇదేనట!