వికారాబాద్ జిల్లాలోని కన్నాయిగూడెం మండలం అప్పనపల్లి ఎస్సీ కాలనీ వింత వ్యాధి కలకలం రేగింది. మొదట ప్రజలు హఠాత్తుగా వాంతులు చేసుకుంటూ, కడుపులో నొప్పితో బాధపడుతూ, కళ్లలో మంటలు పుడుతున్నాయని 45-50 మంది ప్రజలు ఆసుపత్రిలో చేరడంతో.. కారణం తెలియక అధికారులు తలల పట్టుకున్నారు. అంతేకాదు, ఈ కారణంగా ఒకరు మరణించడంతో విషయం కాస్త సీరియస్ తీసుకున్న అధికారులు దర్యాప్తు చేసి ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది.
దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు అసలు విషయం కనిపెట్టారు. స్థానికంగా అమ్మిన కల్తీ కల్లు తాగి వీరికంతా ఇలా అయిందని అధికారులు వెల్లడించారు. కొందరు హఠాత్తుగా నేలపై పడిపోవడంతో.. కొందరికి దెబ్బలు తగిలాయని చెప్పుకొచ్చారు. అందరికీ తగిన వైద్యం అందించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కల్తీ కల్లు కారణంగా మొదట జ్వరం, కడుపులో మంట అని చెప్తున్న స్థానికులు.. తర్వాత కడుపు ఉబ్బి చనిపోతుండడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికి కూడా ప్రజలు ఆసుపత్రులకు తరలివస్తుండడంతో అందరికీ తగిన వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నారు. కేవలం కల్తీ కల్లు మాత్రమేనా లేక వేరేదైనా కారణం ఉందా అన్న దిశగా విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. అనారోగ్య కారణాల గురించి విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్రాధమికంగా కల్తీ కల్లు కారణంగా తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు.
Must Read ;- ఏలూరు ఘోరం అసలు కారణమేంటో తెలిసింది..!