తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. అసలు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? అంటూ ఫేస్ బుక్ వేదికగా ప్రశ్నించారు. వేగంగా టీకాలను అందిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందని. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్లు అందేలా నరేంద్ర మోదీ ప్రభుత్వ తీవ్రంగా కృషి చేస్తోందని విజయశాంతి అన్నారు.
టీకాల పంపిణీపై టీఆర్ఎస్ సర్కారు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అని, స్వదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయకుండా విదేశాలకు టీకాలు అమ్ముకొంటుందని కేంద్రంపై నిందలు మోపుతున్నవారికి బాధ్యత ఉందా..? మండిపడ్డారు. స్వదేశీ సాంకేతికతతో టీకా తయారీ చేసుకోవడం మీరు ఓర్చుకోలేకపోతున్నారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దుర్మార్గమని విజయశాంతి అన్నారు.
Must Read ;- ‘తమ్ముడూ అభినందనలు’.. బీజేపీలో ఈటల చేరికపై విజయశాంతి