వినేవాడుంటే.. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్పుకుంటూ పోతారు. నరం లేని నాలుకకు అడ్డు అదుపు ఏముంది? బీజేపీ వరస చూస్తే అలాగే అనిపిస్తుంది. కేంద్రంలోని వాళ్లమో లాభాలు లేవనే నెపంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి పావులు కదుపుతుంది.. ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ వాళ్లేమో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా మోకాళ్లడ్డేసి మరీ ఆపేస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారు. వాళ్లే ప్రైవేటీకరణ చేసేస్తాం అంటారు.. వాళ్లే పోరాడి ఆపేస్తాం అంటారు.. జనాలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారో.. వాళ్లే పిచ్చెక్కి మాట్లాడుతున్నారో అర్థం కాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు.
వాట్ ఎ జోక్..
ఏపీకి జరిగిన ప్రతి అన్యాయంలో బీజేపీ హస్తం ఉందనే సంగతి ప్రజలకు తెలుసు. మరి వాళ్ల కళ్లబొల్లి మాటలను ప్రజలు నమ్ముతారనే ఎలా అనుకుంటున్నారో ఏమిటో.. మోత్తానికి ఇలాంటి మాటలతో జోకర్లు అవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదనే విషయం గ్రహించాలి. ప్రజలను మభ్యపెడుతూ పనిచేయించుకోవడం ఎంతో కాలం నిలవదు. ఇది ఇప్పటికే బీజేపీకి ఆంధ్ర ప్రజల విషయంలో అర్థమై ఉండాలి. కానీ, కేంద్రం వాళ్లేమో ప్రైవేటీకరణకు రైట్ రైట్ అంటారు.. రాష్ట్ర బీజేపీ వాళ్లేమో ఉద్యమాలంటూ గొంతు చించుకోవడం చూస్తే.. వారు ప్రజల గురించి ఎంత చులకనగా అనుకుంటున్నారో తెలుస్తుంది.
Must Read ;- విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. కాపాడుకుందాం రండి