ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. ఇష్టపత్రిక, వైసీపీ కరపత్రిక.. సాక్షి.. దేశంలోని పత్రికలన్నింటిది ఒక రూట్.. ఆ పేపర్ ది, అదే పార్టీకి చెందిన చానెల్ సాక్షిది మరో రూట్.. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ, దాని మద్దతుదారులపై విషపు రాతలు రాస్తూ వికృతానందం పొందుతోంది.. తాజాగా మరోసారి సాక్షి పత్రికని దాని విమర్శకులు, వ్యతిరేకులు యాక్ ఛీ అని ఎందుకు అంటారో అర్ధం అవుతోంది..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆయన రాజకీయ వారసుడు లోకేష్… కో బ్రదర్ భరత్ పై సాక్షి విషపు రాతలు రాస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని కొందరిని రెచ్చ గొట్టాలని ప్రయత్నాలు ప్రారంభించిందని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.. బాలకృష్ణ అల్లుడు పాదయాత్ర.. విశాఖ టీడీపీలో చిచ్చు రాజేస్తోందా అంటూ సాక్షి ప్రచురించిన కథనంపై వైసీపీ నేతలే ఆశ్చర్యానికి గురయ్యేలా ఉంది..
గత ఎన్నికలలో విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్.. ఓటమిచెందారు.. ఈ దఫా ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీనికోసం ఆయన ముందునుండే కసరత్తు ప్రారంభించారు.. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి రంగంలోకి దిగాలనుకుంటున్న భరత్… అక్కడి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని తన కో బ్రదర్ నారా లోకేష్ రూట్ లోనే పాదయాత్ర ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ పాదయాత్రతో నియోజకవర్గంలోని ప్రతి గడప గడపను టచ్ చేయడం, ప్రజలని స్వయంగా పలుకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం, వాటిని పరిష్కరించే బాధ్యత తానుత స్వీకరిస్తానని హామీ ఇవ్వడంపై ఈ పాదయాత్రలో దృష్టి పెడుతున్నారు భరత్.. గత ఎన్నికలలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఓట్ల చీలికతో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయిన భరత్.. ఈసారి ఎక్కడ పోటీ చేసినా భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, వైసీపీ సర్వేలలోనూ స్పష్టం అయిందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.. ఇదే ఇప్పుడు వైసీపీకి మింగుడు పడడం లేదు.. ఆయన ప్రతిష్టని మంటగలిపేలా… విషపు రాతలు రాస్తూ వికృతానందం పొందుతోంది సాక్షి.
ముఖ్యంగా విశాఖ దక్షిణ స్థానం నుండి భరత్ బరిలోకి దిగితే.. గతంలో అక్కడి నుండి పోటీ చేసిన గండి బాబ్జీ పెందుర్తికి షిఫ్ట్ అవుతున్నారని ఈ కథనంలో తెలిపింది సాక్షి.. పెందుర్తి నుండి గతంలో అమీతుమీ తేల్చుకున్న టీడీపీ సీనయిర్ నేత బండారుకి అక్కడ స్థానం లేదని వాపోతోంది సాక్షి పత్రిక.. ఇదంతా టీడీపీ అంతర్గత వ్యవహారం.. ఎవరికి టికెట్లు ఇవ్వాలో, ఎవరిని ఎక్కడి నుండి బరిలోకి దింపాలో అనేది ఆ పార్టీ హైకమాండ్ తేల్చుకుంటుంది.. కానీ, టీడీపీ అభ్యర్ధుల బాధ సాక్షి బాధగా ప్రేమ ఒలకబోయడం శోచనీయం. నిజంగా జగన్ పత్రికకి, ఆయనకి అంతటి సానుభూతి ఉంటే.. తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా ఎదిగిన గీతమ్ యూనివర్శిటీపై ఆయన ఎంతటి ప్రేమను కురిపించారో అర్ధం చేసుకోవచ్చని కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ నేతలు.. సాక్షి.. తన పని తాను చూసుకొని, వైసీపీని చక్కదిద్దుకోవడం, ప్రజలకు పథకాలు అందేలా చూడడంపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు రాజకీయ విశ్లేషకులు.