చిక్కోటి ప్రవీణ్.. ఈ పేరు వింటే చాలు.. తెలుగు రాష్ట్ర ప్రజలకు గుర్తువచ్చేది గ్యాంబ్లింగ్.. జూదంతో ఆయన వందల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారు.. క్క రోజులో వందల కోట్ల బెట్టింగ్ లు జరపడం, బడా బాబులను బుట్టలో వేసుకోవడం చిక్కోటి ప్రవీణ్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెబుతారు.. చిక్కోటి చీకటి బాగోతం మరోసారి బయటపడింది.. ఈసారి థాయ్ ల్యాండ్ సాక్షిగా 90 మందితో పట్టుబడ్డారు.. పలువురు బడా బాబులతో ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ గడ్డపై గ్యాంబ్లింగ్ ఆడి అడ్డంగా బుక్ అయ్యారు.. థాయ్ ల్యాండ్ పోలీసులకి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు..
విదేశాలకు, గోవాలాంటి ప్రాంతాలకే పరిమితం అయిన క్యాసినో స్టయిల్ ని ఏపీలోని గుడివాడ గల్లీలకు తీసుకువచ్చిన క్రెడిట్ ఆయన సొంతం.. రెండేళ్ల క్రితం.. గుడివాడలోని గల్లీలకి కేసినో పందేలను, అమ్మాయిల అర్ధనగ్న ప్రదర్శనల డ్యాన్స్ లని తీసుకువచ్చి.. ఎందరి దగ్గరినుండో కోట్లరూపాయలు కొల్లగొట్టాడని పుంఖాను పుంఖానులుగా కథలు వెలువడ్డాయి.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని… స్వయంగా రెడ్ కార్పెట్ పరిచి మరీ ఈ కేసినోలని ఏర్పాటు చేశారని ఆధారాలతో బయటపడినా, మాజీ మంత్రి అడ్డంగా బుకాయించారు.. అక్కడ కేసినో ఏర్పాటు చేశారని, గ్యాంబ్లింగ్ జరిగిందని నీ అమ్మ మొగుడు చెప్పారా అంటూ నిలదీయడం చూసి ఏపీ ప్రజలు షాక్ అయ్యారు..
అధికార పార్టీ అండతో చికోటి ప్రవీణ్ గతంలో గుడివాడలో రెచ్చిపోయారు.. థాయ్ లాండ్ లోనూ గుడివాడ మార్క్ దందాని ప్రదర్శించాలని కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ వాలిపోయింది ఛీ.. కోటి గ్యాంబ్లింగ్ టీమ్.. సుమారు 90 మంది అక్కడ ఓ స్టార్ హోటల్ లో ల్యాడ్ అయింది.. వీరి కదలికలపై అనుమానం వచ్చిన థాయ్ లాండ్ పోలీసులు పక్కా స్కెచ్ తో అనుసరించారు. అంతే రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయారు.. ఛీ కోటి ప్రవీణ్ తోపాటు మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మాధవ్ రెడ్డి, హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతాలకు చెందిన ఓ వీఆర్ఏతోపాటు మరికొంతమంది బడా బాబులు బుక్ అయ్యారు.. వీరితోపాటు పలువురు డ్యాన్స్ గాళ్స్ సైతం దొరికారు.. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు..
చిక్కోటి ప్రవీణ్ చీకటి బాగోతం అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చింది.. దీంతో, గతంలో ఆయనని సమర్ధించిన కృష్ణా జిల్లా వైఛీపీ బ్రదర్స్ గా పాపులర్ అయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ఈ తాజా పరిణామంపై ఆ ఇద్దరూ సమర్ధించుకోవడానికి సైతం సిగ్గు పడుతున్నారని చెబుతున్నారు వైసీపీకి చెందిన కొందరు నేతలు. మరి, ఈ పరిణామంతో అయినా గుడివాడ, గన్నవరం ప్రజలలో చైతన్యం వస్తుందేమ చూడాలి.