పూరీ జగన్నాథ్ ‘లోఫర్’ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయం అయిన అందాల సుందరి దిశా పటాని. ఆ సినిమా పరాజయం పాలైనప్పటికీ.. అమ్మడి కెరీర్ కు మాత్రం ఎలాంటి డ్యామేజ్ జరగలేదు సరికదా.. బాలీవుడ్ లో హీరోయిన్ గా నిరూపించుకొనే బంగారం లాంటి అవకాశమొచ్చిపడింది. దాని ఫలితమే .. యంస్ దోనీ అన్ టోల్డ్ స్టోరీ సినిమా. ఆ సినిమాలో దిశ పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. ఆ సినిమా తెచ్చిపెట్టిన విజయం.. ఆమెను బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది.
భాగీ 2, భారత్ , మలాంగ్ లాంటి సినిమాలతో సత్తా చాటుకుంది. ప్రస్తుతం దిశా పటానీ బీ బౌన్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . అంతే కాకుండా.. టైగర్ తో రిలేషన్ కూడా ఆమెను మరింత ఫేమస్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం దిశా పటానీ.. రాధే , ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాల్లో ప్రాముఖ్యమున్న పాత్రల్నే ధరిస్తోంది. అయితే. వాటిలో ఏక్ విలన్ రిటర్న్స్ లో ఆమె యాక్షన్ సీన్స్ లో కూడా పాల్గొంటూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పటికప్పుడు తన బాడీ ఫిట్ నెస్ మీద శ్రద్ధపెట్టే దిశ .. షూటింగ్స్ లేకపోతే జిమ్ లోనే ఎక్కువ టైమ్ గడుపుతుంది. అలాంటిది ఆమె యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోందంటే.. ఆగుతుందా? ఓ రేంజ్ లో ప్రాక్టీస్ చేసేస్తోంది.
మహిళా దినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ హ్యండిల్ ద్వారా విడుదల చేసిన వీడియో నే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దిశా పటానీ.. చాలా వేగంగా సైడ్ కిక్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనని స్ట్రాంగ్ గా మార్చుతున్నందుకు తన ట్రైనర్ రాకేశ్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంది అందాల దిశ.
Must Read ;- వెన్నెల వేడి పుట్టించడమంటే ఇదేనేమో!
Happy women’s day ❤️🌸 thank you for making me strong #RaakeshYadhav 🌸 pic.twitter.com/i1pYlwFFhh
— Disha Patani (@DishPatani) March 8, 2021










