వెన్నెల చల్లగా ఉంటుంది .. హాయిగా అనిపిస్తుంది .. మనసును మత్తుపాత్రగా మార్చేసి మరోలోకానికి తీసుకెళుతుంది.కానీ వెన్నెల కూడా వేడిగా అనిపించే సమయాలు .. సందర్భాలు ఉంటాయని కొంతమంది కవులు సెలవిచ్చారు. వాళ్లు చెప్పింది నిజమేనని అనిపించకమానదు .. దిశా పటానీని ఇలా చూస్తుంటే. కథానాయికగా ఈ సుందరి ఐదేళ్ల క్రితమే రంగంలోకి దిగింది. ‘లోఫర్’ సినిమాతో వెండితెరకి పరిచయమైన ఈ అమ్మాయి .. సూపర్ ఫిగర్ అనిపించుకుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా, హాటు లుక్కులతో విపరీతమైన క్రేజ్ ను తెచ్చేసుకుంది.

తెరపైనే కాదు .. ఊరించే అందాలను ఉత్సాహంగా ఆరబోయడంలో ఈ పిల్ల సోషల్ మీడియాలోను అంతే యాక్టివ్ గా ఉంటుంది. వేడిక్కించే .. వెర్రెక్కించే ఫొటోలను పోస్ట్ చేస్తూ, ఒళ్లంతా కళ్లు ఎందుకు ఇవ్వలేదని చింతించే పరిస్థితికి కుర్రాళ్లను తీసుకొస్తోంది. తాజాగా ఆమె తాను స్విమ్మింగ్ పూల్లోకి దిగిన ఒక ఫొటోను వదిలింది. ఆ ఫొటోను చూసిన కుర్రాళ్లు ‘జ్వరం’ తెచ్చుకుంటున్నారు. భయపడి కాదండోయ్ .. ఆ స్విమ్మింగ్ పూల్లో తాము కూడా దిగలేకపోతున్నందుకు.
చెర్రీ పండు రంగు బికినీతో దిశా పటాని జలకాలాడుతోంది. అలసిన అందాలకు విశ్రాంతిని ఇస్తూ అలా కాసేపు ఆగింది. సూర్యుడి నులివెచ్చని కిరణాలతో వెచ్చదనాన్ని పొందుతూ కళ్లు మూసుకుంది. స్నానంలో ధ్యానం అన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి. అందాలన్నీ తనకు మాత్రమే ధారపోసిన పైవాడికి ధన్యవాదాలు తెలుపుకుంటూనే, ఆ అందాలను చూసి తట్టుకునే శక్తిని కుర్రాళ్లకు ప్రసాదించమని ప్రార్ధిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ పాలరాతి శిల్పం ఎక్కువసేపు అలాగే నిలబడిపోతే, ఎత్తుకెళ్లి ఏ మ్యూజియంలోనో పెట్టేస్తారేమోనని కుర్రాళ్లు ఆందోళన చెందుతున్నారు. అందానికి అభిమానులు ఎక్కువని అందుకేగదా అన్నారు.
Must Read ;- అందచందాల ప్రదర్శనకు ఆకాశమే హద్దు!











