‘ఒరు అడార్ లవ్’ సినిమాలోని ఒక చిన్న కన్నుగొట్టుడు సన్నివేశంతో .. కుర్రాళ్ళ గుండెల్లో తన పరువాల బుల్లెట్ దింపింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఆ ఒక్క సన్నివేశంతో సినిమా ఇంకా విడుదల కాకుండానే.. ఆమె దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాలను.. ఫాలోవర్స్ ఉప్పెనలా ముంచెత్తారు. యూ ట్యూబ్ లో ఆమె నటించిన సన్నివేశం తాలూకు పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చిపడ్డాయి. ఆ సినిమా విడదలై.. అట్టర్ ఫ్లాపైనాసరే.. ఆమె కెరీర్ కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు సరికదా.. చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చిపడ్డాయి.
తన మొదటి సినిమా క్రేజ్ తో ప్రియా వారియర్ ‘శ్రీదేవి బంగ్లా’ అనే బాలీవుడ్ మూవీ ఆఫర్ అందుకుంది. అత్యధిక పారితోషికం అందుకొని .. ప్రియా అందులో తన అందం, అభినయంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది కానీ.. వివాదాల కారణంగా సినిమా విడుదల ముంగిట ఆగిపోయింది. ఇక మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే అమ్మడు సినిమాలతో పాటు ఇప్పుడు మరో రకంగా కూడా సంచనాలకు తెరదీస్తోంది. త్వరలో సింగర్ అవతారం కూడా ఎత్తుతోంది. అయితే అది సినిమా కోసం కాదు. ఒక ఆల్బమ్ కోసం . అది కూడా హిందీలో. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కొన్ని హాట్ ఫోటోస్ ను ప్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ ఫోటోస్ ల్లో ప్రియా గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. అందులో ప్రియా ఇచ్చిన క్లీవేజ్ పోజులు మతిపోగొట్టేస్తున్నాయని కుర్రోళ్ళు అంటున్నారు. అంతేకాదు ఆ సందర్భంగా ప్రియా ఎదపైన, మెడపైన ,చేతిపైనా టాటూస్ వేయించుకుంది. ఈ రకంగా ఇప్పుడు కుర్రకారును ఫ్లర్ట్ చేస్తోంది. అప్పుడు కన్ను కొట్టుడుతో .. కనికట్టు చేసిన ఆ సుందరే ఇప్పుడు పచ్చొట్లతో మనసులు కొల్లగొడుతుండడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఆల్బమ్ విడుదలయ్యే లోపు ఇంకెంతగా తన అందాలతో రచ్చ చేస్తుందో చూడాలి.