మలయాళంలో విజయవంతమైన ‘ప్రతిపూవంకోజి’ సినిమా హక్కులు బోనీకపూర్ సొంతమయ్యాయి. ఈ సినిమాని మూడు భాషల్లో రీమేక్ చేయడానికి బోనీ కపూర్ దీని హక్కుల్ని కొనుగోలు చేశారు. దీన్ని తెలుగు, తమిళం, హిందీలో నిర్మించేందుకు బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలో మంజువారియర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం దర్శకత్వం వహించారు. ఇందులో విలన్ పాత్రను కూడా ఆయన పోషించారు. బోనీ ఈ సినిమా హక్కుల్ని తీసుకోవడం వెనుక కారణం ఉండి ఉంటుంది.
తమ కుమార్తె జాన్వీ కపూర్ తో ఈ పాత్ర చేయించే అవకాశం కూడా కనిపిస్తోంది. కాకపోతే ఇందులో హీరోయిన్ ది కాస్త వయసున్న మహిళ పాత్ర. మరి దీన్ని మార్పులు చేసి తీస్తారా అనే అనుమానం వస్తోంది. మంజువారియర్ చివరిసారిగా నటించిన సినిమా ఇది. 2019లో విడుదలైంది. ముందు హిందీలో రీమేక్ చేసి విడుదల చేస్తారు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో రీమేక్ చేయడానికి వివిధ నిర్మాణ సంస్థలు ఆ హక్కుల్ని ఇస్తారని సమాచారం.
ఏమిటి ఈ సినిమా ప్రత్యేకత?
హీరోయిన్ పాత్ర ఈ సినిమాకి హైలైట్. ఓ బట్టల షాపులో ఆమె సేల్ ఉమన్ గా నటించింది. ఈ మహిళ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఆమెను బస్సులో పట్టుకుంటాడు విలన్. అతనిపై పగతీర్చుకునేందుకు ఈమె ఏంచేస్తుంది అనేదే చిత్ర కథ. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. పైగా నటిగా మంజువారియర్ కు ఇది మంచి పేరు తెచ్చెపెట్టింది. దీన్ని అన్ని భాషల్లోనూ రీమేక్ చేయించాలనేది బోనీ కపూర్ ఉద్ధేశం. అందుకే అన్ని భాషల హక్కులనూ ఆయన సొంతం చేసుకున్నారు. మరి తెలుగులో దీన్ని ఎవరు నిర్మించనున్నారో చూడాలి. అసలు ఈ సినిమా ఓ కథ ఆధారంగా తెరకెక్కింది. ఈవ్ టీజింగ్ పై ఉన్నిఆర్స్ సంకడం పేరుతో కథ రాశారు. ఈ సినిమాకి ఆయన కూడా స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశారు.











