26 జిల్లాలుగా ఏపి రూపాంతరం!
ఏపీలో ఉన్న 13 జిల్లాలలోని 25 పార్లమెంట్స్ ను జిల్లాలుగా ప్రకటించాలని ఎప్పటి నుంచి ఉన్న ప్రతిపాదన. ఇందులో భాగంగా 25 పార్లమెంట్స్ స్థానాలను, అరకు ను రెండు జిల్లాలుగా విభజించగా.. మొత్తం 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆన్లైన్ లోనే మంత్రుల నుంచి ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. కొత్త జిల్లాల వివరాలను ఆన్లైన్ లోనే సర్క్యూలేట్ చేసింది. 1974 ఏపీ జిల్లాల చట్టంలోని సెక్షన్ -3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటును ప్రారంభించింది. మరోవైపు సీఎస్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు.
రెండు రోజుల్లో నోటిఫికేషన్..
రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ప్రభుత్వం మరో రెండురోజుల్లో నోటిఫికేషన్ వెలువరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తెలిపాయి. అయితే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం దీనికి ప్రతిబంధకంగా మారనుంది. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. జనాభా లెక్కల సేకరణ 2021 మే నాటికి పూర్తి కావాల్సి ఉండగా..కోవిడ్ కారణంగా వాయిదా పడింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎలా ముందుకు వెళుతుంది? ఏమైన ప్రత్యామ్నయాలు ఆలోచిస్తోందా? అన్న విషయంలో స్పష్టత రావలిసి ఉంది. ఇదిలా మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుక ప్రభుత్వం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది! మరోవైపు జిల్లా ఏర్పాటు అంశం ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అలా ఏలా చేస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ ను జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే దీనిని పల్నాడు వాసుల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెనుకబడి ఉన్న పల్నాడులో గురజాలను జిల్లాగా ప్రకటించాలని ఎప్పటి నుంచి ఈ ప్రాంత వాసుల డిమాండ్స్. ఇప్పటికే అభివృద్ధి చెందిన నరసరావుపేటను జిల్లాగా ప్రకటిచడం కంటే పల్నాడుకు నడిబొడ్డగా ఉన్న గురజాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. నరసరావుపేటను జిల్లాగా ప్రకటిస్తే.. పల్నాడు వాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Must Read:-టీకాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతో తెలుసా..?