రేపటి నుంచి ఆందోళన బాటలో ఏపీ ఉద్యోగులు!
ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తో సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేశాయి ఉద్యోగ సంఘాలు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు సాధన పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు సమ్మె నోటీసు అందజేశారు. సీఎస్ సమీర్ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్య కార్యదర్శికి నోటీసులు అందజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాలు నుంచి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు ఉద్యోగులు!
పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకు సమ్మె! చర్చల్లేవు!!
పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకు సమ్మె కొనసాగుతోందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని నోటీసులో స్పష్టం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలు తీసుకోకుండా జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. మరోవైపు పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చకు రావాలని ప్రభుత్వం కోరుతున్నా.. కలిసేందుకు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులతో చర్చలకు సచివాలయం రెండో బ్లాక్ లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నిరీక్షించారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ సహా వివిధ అంశాలపై ప్రభుత్వంతో సోమవారం సంప్రదింపులకు రావాలని మంత్రులు పిలుపునివ్వగా ఉద్యోగ సంఘాలు తిరస్కరించారు.
Must Read:-సమ్మె శంఖారావానికి ఉద్యోగులు సమాయక్తం! సీఎస్ కు నోటీసులు ఇచ్చేందుకు రెడీ!!