జగన్ సర్కార్ ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతోందనే విషయం నిజమని ఋజువయ్యింది.ఈ అంశాన్ని రాజ్యాంగ ప్రతిపత్తికలిగిన ఆడిట్ సంస్థ కాగ్ అధికారికంగా తన నివేదికలో తెలిపింది.వైసీపీ ప్రభుత్వం చేసిన వ్యయంలో 48 వేల కోట్ల రూపాయల లెక్కా , జామా లేదని కాగ్ పేర్కొంది. ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వానికి ఆడిట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా కాగ్ నిరాకరించింది. సాధారణంగా లెక్కలు అంతుపట్టనప్పుడు ఇచ్చే క్వాలిఫైడ్ ఒపీనియన్‌ను మాత్రమే జగన్ ప్రభుత్వ జమా ఖర్చులపై కాగ్ ఇచ్చింది.దీంతో జగన్ ప్రభుత్వం పై రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన కాగ్ వంటి ఆడిట్ సంస్థలకు ఎంత నమ్మకం ఉన్నాయో స్పష్టమవుతోంది.నిజానికి ఇప్పటి వరకు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వంపై కాగ్ ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.ఇదిలా ఉంటే 48వేల కోట్ల వ్యయానికి వైసీపీ ప్రభుత్వం దగ్గర లెక్కలు దొరకడంలేదని విపక్షాలు కొన్ని నెలల కిందటే చెప్పింది. ఆ సమయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన దానిని ఎగతాళి చేశారు. ఇప్పుడు స్వయంగా కాగ్ ఇదే విషయం చెప్పడం, ప్రతిపక్షానిది ఆరోపణ కాదు వాస్తవం అని నిరూపిస్తున్నాయి. ఇక రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం మొత్తానికి లెక్కలు లేకపోవడం ఆర్థిక అరాచకానికి పరాకాష్టగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
Must Read:-ప్రజా సమస్యలు గాలికొదిలేసి వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ భజన చేశారు