ప్రజా సమస్యలు గాలికి వదిలేసి అసెంబ్లీలో జగన్ భజన చేయడమే వైసీపీ ఎమ్మెల్యేలు పనిగా పెట్టుకున్నారని టిడిపి ఎమ్మెల్యేలు విమర్శించారు.సమావేశాలు ప్రారంభం నుంచి కల్తీసారా మరణాలు , రాష్ట్రంలో నాసిరకం మద్య పై చర్చకు తాము పట్టుబడితే ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని అన్నారు.కల్తీసారా తాగి 27 మంది చనిపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని తెలుగుదేశం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం మరణాలు ఒక్క జంగారెడ్డి గూడెంలోనే కాదు రాష్ట్రమంతా చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సారామరణాలు, మద్యం అమ్మకాలపై సభలో చర్చించడానికి భయపడుతున్నారంటే ప్రభుత్వం సాగిస్తున్న మద్యం అమ్మకాల్లో కచ్చితంగా అవకతవకలు జరుగుతున్నాయనే భావించాలని అన్నారు. ప్రభుత్వం అమ్ముతున్న జే బ్రాండ్స్ మద్యంలో, కల్తీసారాలోని హానికారక విషపదార్థాల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారపార్టీసభ్యులు ఎలాగూ ప్రజలసమస్యలపై చర్చించకపోవడంతోనే తాముసభలో చిడతలువాయిస్తూ భజనకార్యక్రమం మొదలుపెట్టామని..కల్తీసారా మరణాలు సహజ మరణాలంటూ ముఖ్య మంత్రి సభలో సత్య దూరమైన ప్రకటనలు చేశాడని వారు వెల్లడించారు.కల్తీసారా మరణాలపై చర్చకు రావాలని తాము పట్టుబడితే స్పీకర్ కనీసం తమవైపు కూడా చూడకుండా సస్పెండ్ చేయడమే పనిగాపెట్టుకున్నారని తెలిపారు.
Muwst Read:-వైసీపీలో ఐడ్రీమ్ చిచ్చు !