ఏపీలో ప్రభుత్వ పధకాల అందజేతకు వైసీపీ ప్రభుత్వం కొర్రీలు విధిస్తోంది. ఇప్పటికే ఆంక్షలతో అనేక మందిని వివధ ప్రభుత్వ పద్ధకాలకు దూరం చేసిన జగన్ సర్కార్, తాజాగా వైఎస్సార్ పెన్షన్ కానుక పై కొత్త మెలిక పెట్టింది. పెన్షన్లన్నీ ఆధార్ ఆధారంగానే చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి నెలా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల తదితర సామాజిక పెన్షన్లు అందుకునే వారు ఆధార్ నంబర్, ఆధార్ అథెంటికేషన్ కలిగి ఉండాల్సిందేనని పేర్కొంది. పెన్షన్ చెల్లింపులకు సంబంధించి వేలిముద్రలు సరిగా పడకుంటే ఐరిస్ స్కాన్/ఫేస్ అథెంటికేషన్, అదీ లేకపోతే ఆధార్ వన్‌టైం పాస్‌వర్డ్, వీలుకాకుంటే ఆధార్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ రీడర్ ద్వారా పెన్షన్లు అందించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే వెలి ముద్రలు ,ఐరిస్ సరిగ్గా పడక అనేకమంది ప్రతీ నెల పెన్షన్ పొందడానికి నానా ఆగచాట్లు పడుతున్నా సంగతి విధితమే. అయితే ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన ఈ విధానం తమ పాలిత గుదిబండగా మారబోతోందనే ఆవేదన పెన్షన్ దారుల నుంచి వ్యక్తం అవుతోంది.
Must Read:-నెల నెలా జీతాలకు కటకటే..!