బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, పబ్లిక్ ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించని వారిపై, రూ.1000 జరిమానా విధించనుంది. ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది. ఇక హోలీ వేడుకలను బహిరంగంగా జరుపుకోవడాన్ని కూడా సర్కారు నిషేధించింది. హోలీ మొదలుకొని రంజాన్ ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జనం ఒకేచోట గుంపులు గుంపులుగా ఉండటంపైనా ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, పార్కులు, ఇతర ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలు చేయొద్దని నిర్దేశించారు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, పోలీస్ కమిషనర్లు ఈ ఆంక్షలపై తమ పరిధుల్లో నోటిఫికేషన్లను జారీ చేయాలని ఆదేశింశారు. నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని వారికి సూచించారు.
Must Read ;- జర జాగ్రత్త.. టీకా తీసుకున్నా కరోనా వస్తుంది : శ్రీనివాస్











