మల్లంపల్లి చంద్రశేఖరరావు కాస్తా చంద్రమోహన్ గా మారడానికి కారణం అదే. చంద్రమోహన్ నటుడిగా సినీ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చినప్పుడు పేరు మార్చుకోవడానికి కారణం అదే. అప్పటికే రామ్ మోహన్ అనే నటుడు ఉన్నాడు. వీరిద్దరూ సమకాలికులు అనే చెప్పాలి.
రంగుల రాట్నంలో రామ్ మోహన్ తోనే చంద్రమోహన్ కలిసి నటించాల్సి వచ్చినప్పుడు చంద్రమోహన్ గా పేరు మార్చుకోక తప్పలేదు. ఆ తర్వాత వచ్చిన మురళీ మోహన్ పేరు కూడా ఈ కోవలోనే మారింది. రాజబాబు అనే మరో నటుడు ఉండటంతో మురళీ మోహన్ గా పేరు మార్చుకోక తప్పలేదు. శివశంకర వరప్రసాద్ గా చిరంజీవి పేరు మారడానికి కారణం కూడా అలాంటిదే. అప్పటికే శంకర్ అనే నటుడు, ప్రసాద్ బాబు అనే నటుడు ఉండటంతో చిరంజీవిగా పేరు మార్చుకోవాల్సిన అవసరం శివశంకర వరప్రసాద్ కు ఏర్పడింది. ఆ టైమ్ లో సినీ రంగ ప్రవేశం చేసిన వారంతా ఫ్యాషన్ కోసమో, లక్ కోసమో పేరు మార్చుకోక తప్పలేదు. పొట్టిగా ఉన్న చంద్రమోహన్ కు కుప్పలు తెప్పలుగా అవకాశాలు రావడానికి కారణం ఆయనలోని ప్రతిభే అనాలి.
విలక్షణ పాత్రలు వెరసి చంద్రమోహన్
విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఎవరని అంటే ఎవరైనా కమల్ హాసన్ తర్వాత చంద్రమోహన్ పేరే చెబుతారు. కథానాయకుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించి విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా, అనేక వైవిధ్యమున్న ఎన్నో పాత్రల్లో చంద్రమోహన్ మెప్పించారు. అది ఎలాంటి పాత్ర అయినా తన నటనా కౌశలంతో మెప్పించే నటుడు చంద్రమోహన్. కలికాలం, పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం.. లాంటి చిత్రాలెన్నో ఆయన నటనా కౌశలానికి అద్దం పడతాయి.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత బాగా నటించే నటుల్లో చంద్రమోహన్ ఒకరనే చెప్పాలి. ఓ సందర్భంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కమల్ హాసన్ కి ఏమాత్రం తీసిపోని ఆర్టిస్టు తెలుగులో ఉన్నాడంటే అది ఒక్క చంద్రమోహనే అని కితాబిచ్చారు. అది నూటికి నూరు శాతం నిజం. నిజానికి స్వాతి ముత్యంలో కమల్ హాసన్ పోషించిన పాత్ర చేసే అవకాశం కూడా మొదట చంద్రమోహన్ కే వచ్చిందట. పదహారేళ్ల వయసులో చంద్రమోహన్ పోషించిన పాత్రను మొదట తమిళంలో కమల్ పోషించారు. కానీ కమల్ కన్నా బాగా చంద్రమోహన్ నటనే బాగుందంటారు అందరూ. ఈ మాటను కమల్ కూడా అనడం విశేషం.
నటుడు చంద్రమోహన్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, కళా తపస్వి కె విశ్వనాధ్ అన్నదమ్ముల వరుస అవుతారని అంటూ ఉంటారు.‘నేను పాటలు పాడిన నచ్చిన అతి కొద్దిమంది నటుల్లో చంద్రమోహన్ ఒకడు. వాడు అద్భుతమైన నటుడు, ఎలాంటి భావాన్ని అయినా తెర మీద చూపించగలడు. నా ఆల్ టైం ఫేవరెట్ నటుడు చంద్రమోహన్’ అనేవారు బాలు. చంద్రమోహన్ కి పాటలు పాడటం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడినని చెప్పుకున్నారు బాలు. అందుకే ఆ పాటలు కూడా ఆణిముత్యాల్లాంటివి అయ్యాయి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా స్వయానా చంద్రమోహన్ కి మేనల్లుడు. ఆయనే ఇప్పుడు చంద్రమోహన్ అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షించారు.
అంత్యక్రియలు సంపూర్ణం
చంద్రమోహన్ భౌతిక కాయానికి సోమవారం మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. అమెరికాలో ఉన్న ఆయన కూతురు రావాల్సి ఉన్నందున ఆమె వచ్చాక సోమవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. పంజాగుట్ట లోని స్మశానవాటికలో జరుగుతాయి. అంత్యక్రియలు పూర్తి చేశారు. చిత్ర పరిశ్రమలో ప్రముఖులు అనేక మంది వీడ్కోలు యాత్రలో పాల్గొన్నారు. మొదట ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్‌కు చివరిసారి వీడ్కోలు పలికారు.
అనంతరం పంజాగుట్టలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. చంద్రమోహన్ సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.అంతిమయాత్రకు ముందు సినీ ప్రముఖులు చంద్రమోహన్‌కు నివాళులర్పించారు. వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరిరావు, మాదాల రవి, గౌతమ్ రాజు తదితరులు ఆయన భౌతికకాయం నివాళులర్పించారు.