చిత్తూరు పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అధికారులు నిర్బంధించడంతో రేణిగుంట ఎయిర్ పోర్టు లాంజ్‌లో అయన నిరసన చేపట్టారు. ఎయిర్ పోర్టులో 9 గంటల నిరసన తర్వాత హైదారాబాద్ బయలుదేరటానికి చంద్రబాబు అంగీకరించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ , చిత్తూరు ఎస్పీ ఇచ్చిన హామీ మేరకు ఆయన నిరసన విరమించి హైదరాబాద్ బయలు దేరారు.
ఉదయం నుంచి ఉద్రిక్తత
దీంతో ఉదయం నుంచి ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు తెర పడింది. ఉదయం నుంచి నిరసన కొనసాగించిన చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. నేలపై కూర్చుని, మంచి నీళ్లు కూడా తాగకుండా చంద్రబాబు నిరసన తెలిపారు. తనను అడ్డుకోవడంపై జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలతో మాట్లాడటానికి వెళతానని చెప్పినా, మీడియాతో మాట్లాడతానన్నా ఆయన్నుబయటకు వెళ్లనివ్వలేదు