స్కిల్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయన అనారోగ్య కారణాలు దృష్ట్యా మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 9 న స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తరువాత చంద్రబాబు తరఫున సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరుఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాలను సీఐడీ నేటికీ సబ్మిట్ చేయలేకపోవడం గమనార్హం. మరోవైపు కేసు చట్టాలకు విరుద్దంగా నమోదు చేశారని.., తప్పుడు ఆరోపణలే ఎక్కువగా ఉన్నాయని వాదిస్తూ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని హైకోర్టులో సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినింపిచారు. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మస్ చేయాగా.. సుప్రీం ను ఆశ్రయించారు. అయితే సుప్రీంలో కూడా ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. రేపోమాపో దీనిపై తీర్పును వెలువడనున్నది.
ఈ నేపధ్యంలో కోర్టుల్లో వాదనలు ప్రతివాదనలు నడుమ చంద్రబాబు 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. జైల్లో చంద్రబాబు తీవ్ర అనారోగ్యం భారీ పడ్డారు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించి.., ప్రమాదపు అంచుకు చేరింది. దీంతో చంద్రబాబు తరుఫున న్యాయవాదులు హైకోర్టులో మధ్యంతర బెయిల్ కు అప్లై చేశారు. దీనిపై నిన్న వాదనలు ముగిసిన తరువాత నేడు ఉదయం మొదటి గంటలో హైకోర్టు మధ్యంతర బెయిల్ పై తీర్పును వెలువడించింది. కండీషనల్ బెయిల్ మంజురు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. లక్ష రూపాయలతో రెండు పూచికత్తులు, నాలుగు వారాలు బెయిల్ ను మంజురు చేసింది. అలానే ఏ ప్రైవేటు హాస్పటల్లోనైనా చంద్రబాబు వైద్యం చేసుకోవచ్చని బెయిల్ చెప్పుకొచ్చింది కోర్టు. చంద్రబాబు కు పూచికత్తుగా దేవినేని ఉమా, బొండా ఉమాలు ఏసీబీ కోర్టులో దరఖాస్తులను సమర్పించారు.