పంచాయతీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుంగనూరులో 49 డివిజన్లకు 39 డివిజన్లు ఏకగ్రీవం చేశారని పెద్దిరెడ్డి రౌడీయిజం చేస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. పెద్దిరెడ్డి రౌడీని అనుకుంటున్నాడేమో…. నేను రౌడీలకే రౌడీనని చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రౌడీయిజం విజయవాడలో నడవదని, గుడ్డలు విప్పి కొడతారని చంద్రబాబు హెచ్చరించారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత ఇవాళ విజయవాడలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతలంతా ఐక్యతారాగం పలికారు. జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు.
విశాఖకు సంబంధం లేని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఏ2 విజయసాయిరెడ్డి చొరబడి అక్కడి భూములన్నీ కాజేశాడని, వైసీపీ వారిని గెలిపిస్తే విజయవాడలోనూ కబ్జాలకు తెగబడతారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖకు విజయసాయిరెడ్డి శనిలా దాపురించాడని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. దౌర్జన్యాలతో గెలవాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన అన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని, ప్రతిపక్షం లేకపోతే కొట్టినా అడిగేవాడే ఉండరని వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
Must Read ;- వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే కుక్కలు, గాడిదలపైనా పన్ను: చంద్రబాబు











