చంద్రబాబు పాలన ఏంటో, అది ఎంత జనరంజకంగా ఉంటుందో, అంతకుమించి భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పటికే నిరూపితం అయింది. చంద్రబాబు విజన్‌ను ఒకప్పుడు హేళన చేసినవారంతా ఇప్పుడు నీళ్లు నమిలే పరిస్థితి ఉంది. పల్లెటూరును సైతం పట్నం చేయగలిగే సత్తా చంద్రబాబు సొంతం. ఒకప్పుడు హైదరాబాద్ శివారులో కనిపించిన గుట్టల స్థానంలో ఇప్పుడు కళ్లు చెదిరే భవంతులు, ఫారిన్ ను తలపించే మౌలిక సదుపాయాలు కనిపిస్తున్నాయంటే.. అందుకు కారణం చంద్రబాబు వేసిన పునాది అనడంలో ఏ మాత్రం ఎవరికీ సందేహం లేదు.
అలాగే నీళ్లు లేని అనంతపురానికి కియా పరిశ్రమ తేవడం, అమరావతికి సాఫ్ట్ వేర్ కంపెనీలను రప్పించడం ఆయనకే చెల్లింది. ఇవన్నీ నిరూపితం అయిన నిజాలే. చంద్రబాబు పరిపాలన గురించి రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినప్పటికీ.. పార్టీ లైన్‌కు కట్టుబడి అలా మాట్లాడతారే కానీ, అవి వారి గుండెల్లోంచి రావనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు ఏపీలో సీఎం అయిన 2 నెలల్లోనే తన సత్తా ఏంటో నిరూపించారు.
దేశంలోనే బెస్ట్ సీఎంల రేసులో ఐదో స్థానం దక్కించుకున్నారు చంద్రబాబు. సీఎంగా వచ్చిన 2 నెలల్లోనే అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో దూసుకుపోతూ తన మార్కును చూపించారు. అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పుడు ఐదో స్థానంలో నిలవడం అందర్నీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఆజ్ తక్-సి ఓటర్, మూడ్ ఆఫ్ ది నేషన్ ఓ సర్వే చేపట్టగా.. అందులో ఈ విషయం వెల్లడి అయింది. ఉత్తమ సీఎంలలో దేశంలో మొదటి స్థానంలో 33 శాతంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉండగా.. రెండో స్థానంలో 14 శాతంతో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మూడో ప్లేస్ లో మమత బెనర్జీ, నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఐదో స్థానంలో చంద్రబాబు నిలిచారు.
కేవలం చంద్రబాబు అధికారం చేపట్టి 2 నెలలే అయినప్పటికీ ఇంత తక్కువ సమయంలో ఈ స్థానం దక్కించుకోవడం మామూలు విషయం కాదని.. సర్వే సంస్థ కూడా అభిప్రాయపడింది. చంద్రబాబు సత్తా ఏంటనేది గతంలోనే నిరూపితం అయిందని జాతీయ జర్నలిస్టులు సైతం చెబుతున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి సర్వేలో ఎక్కడో అట్టడుగున ఉండేవారు. అలాంటిది చంద్రబాబు 2 నెలల్లోనే ఐదో స్థానానికి రావడం చర్చనీయాంశం అయింది. భవిష్యత్తులో ఏపీ సీఎంగా చంద్రబాబు మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తారని అంటున్నారు.











