దుండగుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని ఆయన నివాసంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరామర్శించారు. దాడి ఘటన సమాచారం తెలియగానే చంద్రబాబు గురునానక్ నగర్ లోని పట్టాభి నివాసానికి చేరుకున్నారు. జరిగిన దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఉదయం పట్టాభి ఇంటి నుంచి మంగళగిరి టీడీపీ కార్యాలయానికి బయలుదేరిన కాసేపటికే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పట్టాభికి గాయాలయ్యాయి. ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు.
అరాచక, అనాగరిక చర్య
పట్టాభిపై దుండగుల దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను అనాగరికపు చర్యగా ఆయన అభివర్ణించారు. కాసేపట్లో డీజీపీకి ఘటనపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్న, దేవినేని ఉమ ఉన్నారు.
Must Read ;- అచ్చెన్న అరెస్టుతో సిక్కోలులో ఉద్రిక్తత..