‘జనతాగ్యారేజ్’ లో మోహన్ లాల్ కొడుకుగానూ, ‘భాగమతి’లో అనుష్క ప్రేమికుడిగానూ నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ హ్యాండ్సమ్ హీరో ఉన్నీ ముకుందన్.. ఓ కీలక పాత్రతో తెలుగు వారిని మరోసారి పలకరించబోతున్నాడు. ఇంతకీ అతడు నటించబోయే సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు మాస్ మహారాజా రవితేజ.
ఆయన నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’లో ఉన్నీ ముకుందన్ అతి ముఖ్యమైన పాత్ర పోషించబోతుండడం విశేషం. ఇందులో మెయిన్ విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు రీసెంట్ గా కన్ఫామ్ చేశారు. ఇప్పుడు ఉన్ని ముకుందన్ కూడా నటించనుండడం ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్ వర్మ ఉన్ని ముకుందన్ ను ఈ సినిమా షూట్ లోకి.. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్వాగతం పలికాడు.
‘రాక్షసుడు’ ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో అదిరిపోయే థ్రిల్లింగ్ స్టోరీతో రవితేజ ద్విపాత్రాభినయంతో ‘ఖిలాడీ’ సినిమా తెరకెక్కుతోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు గా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా మే 28న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరి ‘ఖిలాడీ’ సినిమాకి ఉన్ని ముకుందన్ ఏ రేంజ్ లో హైలైట్ కానున్నాడో చూడాలి.
Must Read ;- నాలుగోసారి బాలయ్య వెర్సెస్ రవితేజ
Welcoming Talented Young Actor @Iamunnimukundan on Board into our #Khiladi team. 🤗@RaviTeja_offl @DirRameshVarma @ThisIsDSP @DimpleHayathi @Meenachau6 @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies @KHILADiOffl#KhiladiFromMay28th 🕶️ pic.twitter.com/Tc5cF6RP73
— Ramesh Varma (@DirRameshVarma) February 1, 2021