పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాను ఎదుర్కొని, బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని స్థానాలకూ నామినేషన్లు వేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకులతో జరిగిన టెలీకాన్ఫరెన్సులో ఆయన ఈ మేరకు సూచించారు.
బలవంతపు ఏకగ్రీవాల కోసం తమ పార్టీ నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం, కిడ్నపులు చేయడం లాంటి చర్యలను సహంచబోమని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలోని గ్రామాలను వైసీపీ.. కక్షా కార్పణ్యాలకు వేదికగా మార్చింది. వలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కుట్రలు చేస్తోంది. వీటిని తిప్పి కొట్టాలి. ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేయాలి’’ అని పార్టీ నాయకులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. 90 శాతం పంచాయతీలను ఏకగ్రీవం చేయాలంటూ ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ నుంచి ఆదేశాలు అందాయని, ఈ నేపథ్యంలో.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Must Read ;- బెదిరింపులు, గొడవలు.. ముగిసిన తొలివిడత పంచాయతీ నామినేషన్లు