గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన సీబీఎన్ ఆర్మీ ప్రతినిధులను వెంటనే విడుదల చేయాలని ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ అరెస్టు జరిగిందని,ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను,కేడర్‌ని బెదిరించేందుకే ఈ అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు.ఈ మేరకు లేఖ రాశారు.
‘మే 18న మధ్యాహ్నం 12గంటల సమయంలో గుంటూరులోని అరండల్ పేట్ పోలీసులు 41-ఎ నోటీసులతో పాటు ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేశారు.నిబంధనలను ఉల్లంఘించి ఈ అరెస్టులు జరిగాయి.ఇప్పటికే ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.అర్నిష్ కుమార్ VS బీహార్-2014 కేసుతో పాటు సుప్రీంకోర్టు కూడా భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది.ఆ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అరెస్టులు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన ఎం.మహేష్, కల్యాణ్‌లను అరెస్టు చేయడంతో పాటు వారి ముఖాలకు మాస్క్‌లు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టి మరీ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.అధికార YCP పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడాన్ని కారణంగా చూపి అరెస్టు చేశారు.కాగా అరెస్టు చేసిన మహేష్,కల్యాణ్‌లను అదే రోజు విడుదల చేస్తామని ప్రెస్ మీట్‌లో ఎస్పీ చెప్పినా,మే 18న రాత్రిపూట కూడా పోలీస్ స్టేషన్‌లోనే నిర్భందించి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు.రాజ్యాంగం ప్రసాధించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడంతో పాటు స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరించారు.వాళ్లని వెంటనే విడుదల చేయాలి.రాష్ట్రంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’అని చంద్రబాబు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ..
కాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కారణం చూపుతూ సీబీఎన్ ఆర్మీ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులను మంగళవారం గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రెస్ మీట్‌లో ఈ విషయాలు వెల్లడించారు.గుంటూరు జిల్లా ఘంటావారిపాలేనికి చెందిన, సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ సీబీఎన్ ఆర్మీ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నమాదినేని వెంకట మహేశ్‌బాబుని,టీడీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ,సదరు యూట్యూబ్ ఛానెల్ టెక్నికల్ ఇన్‌ఛార్జిగా ఉన్న మచిలీపట్నం వాసి ఎం. శ్రీసాయి కల్యాణ్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు.వైసీపీ నాయకుల ఫొటోల మార్పింగ్,వీడియోల మార్ఫింగ్‌లు చేస్తూ ప్రతిష్ఠకు,ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వీడియోను పోస్టు చేశారని వైసీపీ యువ విభాగం నాయకుడు పానుగంటి చైతన్య గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మేరకు విచారణ జరిపి, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అరెస్టు చేశామని,గత నెల 24న కేసు నమోదైందన్నారు.కాగా వీరి అరెస్టుతో గుంటూరు జిల్లా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.అదే సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నారు.
Must Read ;- ఎట్టకేలకు విడుదలైన సీబీఎన్ ఆర్మీ ప్రతినిధులు













