వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీబీఎన్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్లో అసత్య వీడియోలు పెట్టారంటూ మాదినేని వెంకట మహేష్,కళ్యాణ్‌లను అరెస్టు చేసిన గుంటూరు అరుండల్ పేట పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు.సీబీఎన్ ఆర్మీ అడ్మిన్‌గా ఉన్న వెంకట మహేష్,కళ్యాణ్‌లను నిన్న అరెస్టు చేసిన పోలీసులు రాత్రంగా స్టేషన్లో విచారించారు.అక్రమ అరెస్టులపై టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేయడంతో గుంటూరు పోలీసులు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.అక్రమ అరెస్టులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
అక్రమంగా అరెస్టు చేశారు
తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మహేష్ మీడియాకు వెల్లడించారు.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తాము ఎలాంటి అసత్య ప్రచారాలు చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు.తమ పార్టీ యువనేత లోకేష్ కూడా ఇలాంటివి ప్రోత్సహించరని మహేష్ వెల్లడించారు.తమను తీవ్రవాదుల మాదిరి ముఖాలకు ముసుగులు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయిస్తే పోలీసులపై సీరియస్ అయ్యే అవకాశం ఉందని భావించి వారిని హుటాహుటిన స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్టు తెలుస్తోంది.
Must Read ;- గుంటూరు ఎస్పీపై నారా లోకేశ్ ఆగ్రహం











