టాలీవుడ్ కమర్షియల్ దర్శకుల్లో ముందుగా వినిపించే పేరు కె.రాఘవేంద్రరావు. ఆయన మెగాస్టార్ చిరంజీవితో తీసిన చాలా సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. కానీ రామ్ చరణ్ తో సినిమా తీయని లోటు అలాగే ఉండిపోయింది. అయితే త్వరలోనే ఆ కాంబో మూవీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిజానికి రాఘవేంద్రరావు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకి సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అయితే ఇన్నాళ్టికి ఆయన కోరిక నెరవేరబోతోందని, అందులోనే రామ్ చరణ్ హీరోగా నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ కోసం రాఘవేంద్రరావు ఎప్పుడో ఒక కథ రెడీ చేసుకున్నారట. ఆ కథ చిరంజీవికి వినిపిస్తే .. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం రాఘవేంద్రరావు .. ఒకప్పటి ‘పెళ్ళిసందడి’ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకా .. చరణ్ తో సినిమా సెట్స్ మీదకు వెళుతుందని అంటున్నారు. మరి రామ్ చరణ్ తో దర్శకేంద్రుడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందో చూడాలి.