చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. స్కిన్‌లెస్ చికెన్ ధర ఒకేసారి హైదరాబాద్ లో రూ. 260కి పెరిగింది. మార్చి 21న రూ.220 ఉండగా, 28 నాటికి రూ.200కు తగ్గింది. అయితే మళ్లీ ధర భగ్గుమంటోంది. గత ఏడాది కంటే కోళ్ల ఉత్పత్తి ఈ ఏడాది చాలా తక్కువగా ఉండటంతో రిటైల్ మార్కెట్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.230 ఉండగా, అదనంగా రూ.30 పెరిగింది. నాలుగు నెలల క్రితం స్కిన్‌లెస్ రూ. 120 నుంచి రూ. 140 వరకు ఉండేది. మటన్ కిలో రూ.700 నుంచి రూ.800 వరకు పలుకుతోంది. దీంతో చికెన్ కొనేవారు పెరగడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి.
Must Read ;- కలవర పెడుతున్నకరోనా సెకండ్ వేవ్.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు