మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారా ? ఇన్నేళ్ల తన సినీ జీవితంలో ఏనాడు పేరును మార్చుకోని చిరు అకస్మాత్తుగా పేరు మార్చుకోవాలనుకునే నిర్ణయం వెనుక అసలు కారణమదేనా?చిరు పేరు మార్పు పై వస్తున్న విమర్శలేంటి? నిజంగా మెగాస్టార్ పేరు మార్చుకుంటున్నారా ? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆయన తన పేరు మార్చుకున్నారనే ప్రచారం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఆచార్య నిరాశపరచడంతో ఎలాగైనా భారీ ట్రీట్ ఇవ్వాలనే రెట్టింపు ఉత్సాహంతో ఉన్న చిరు తన తదుపరి చిత్రం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాగా, ఈ అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.
మెగాస్టార్ ప్రస్తుతం `గాడ్ ఫాదర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.అందులో సాల్ట్ అండ్ పెప్పర్ టోన్‌లో ఉన్న చిరు లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం తమ బాస్ చిత్రం నుంచి విడుదల అయిన ఈ ఫస్ట్ లుక్ తమకు మంచి ట్రీట్‌లా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.
ఇదిలా ఉంటే ఈ లుక్, మాతృకతో పోలికలు పెడుతున్నారు నెటిజన్లు.నిజానికి ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన `లూసీఫర్`కి రీమేక్.మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించగా.. అక్కడ భారీ విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో `గాడ్ ఫాదర్`గా రీమేక్ చేస్తున్నారు. చిరంజీవితోపాటు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతారలు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని ఆర్ బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం చిరంజీవి ఫస్ట్ టైమ్ తన పేరు మార్చుకుంటున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఫస్ట్ గ్లింమ్స్ లో చిరంజీవి పేరులో ఇంగ్లీష్ లెటర్స్ లో ఒక అక్షరం యాడ్ చేశారు. `CHIRANJEEVI`కి బదులుగా `CHIRANJEEEVI` అని ఉంది. అంటే `E` ఎక్కువగా కనిపిస్తుంది. మూడు `ఈ`లున్నాయి. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
నిజానికి తన నలభై ఏళ్ల కెరీర్‌లో చిరంజీవి ఎప్పుడూ పేరు మార్చుకుంది లేదు.”సుప్రీం హీరో” `మాస్టర్`, `బిగ్‌బాస్`, `మెగాస్టార్` ఇలా ఆయనను తన అభిమానులు ఆప్యాయంగా పిలుచుకుంటారు. కానీ ఇన్నేళ్ల చిరు కెరీర్ లో ఆయన పేరు ఎప్పుడూ మారలేదు.అలాంటిది మొదటిసారి చిరంజీవి పేరు మార్చుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతొంది.అయితే దీనికి న్యూమరాలజీ నే ప్రధాన కారణం అని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఖైదీ నెంబర్ 150` తర్వాత చిరంజీవి సరైన సక్సెస్ లేదు. `సైరా` మూవీ క్రిటికల్‌గా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.ఇక ఇటీవల వచ్చిన `ఆచార్య` కూడా డిజాస్టర్ అనే టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపద్యంలో చిరంజీవి హిట్ కోసమే పేరు మార్చుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, చిరు పేరు మార్పు అందులో నిజం లేదని, ఎడిటర్ తప్పిదం వల్లే జరిగిందని చిత్ర బృందం పేర్కొంది. పేరు మార్పులో ఎలాంటి నిజం లేదని.. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకుంటామని వెల్లడించింది.
అయితే మెగాస్టార్ చిరంజీవి పేరు మార్పు అంశంలో ఇప్పటికీ ఆయన అభిమానుల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి కానట్లుగానే కనిపిస్తోంది.