విజేత చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకకు పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమాతో ఫరవాలేదు అనిపించినా.. కమర్షియల్ సక్సస్ మాత్రం సాధించలేదు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ నటించిన తాజా చిత్రం కిన్నెరసాని. ఈ చిత్రానికి రమణ తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రజనీ తాలూరి, రవి చింతల సంయుక్తంగా నిర్మించారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్రవిజయ్ కీలకపాత్ర పోషించారు.
ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే… నీ ముందు ఉన్న సముద్రపు అలల్ని చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయ్. కానీ, సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు. నేను కూడా అంతే.. అంటూ కథానాయిక అన్ షీతల్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.
అలానే కళ్యాణ్ దేవ్ ఏదో రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నట్లు కిన్నెరసాని ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇందులో కళ్యాణ్ చాలా కొత్తగా కనిపించారు. ముఖ్యంగా కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఈ సినిమా అయినా కళ్యాణ్ దేవ్ కి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
Must Read ;- సింగీతం శ్రీనివాసరావు దిక్కట్ర పార్వతికి అరుదైన గౌరవం











