పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండడంతో ఎప్పుడెప్పుడు శ్రీరాముడి గెటప్ లో ప్రభాస్ ని చూస్తామా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అవును.. ఇది నిజంగా నిజం. సినిమా మెజార్టీ శాతం మోషన్ గ్రాఫిక్స్ తో ఉండడంతో చిత్రీకరణ మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ పై తక్కువ సమయంలోనే షూటింగ్ ను ముగించారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుని ఆల్ ఇండియా పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటూ కీర్తిని పొందాడు. అలాంటి ప్రభాస్ రామాయణం ఇతివృత్తంతో ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీని చేయడంతో దేశ వ్యాప్తంగా ఆదిపురుష్ పై రోజురోజుకూ అంచనాలు అధికమౌతున్నాయి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తవ్వడంతో ఇప్పుడు అసలైన గ్రాఫిక్స్ వర్క్ ప్రారంభించనున్నారు. ఇప్పుడు మరింత స్పీడ్ గా ఆ పనులను దర్శకుడు చేయించేందుకు సిద్దం అవుతున్నాడని సమాచారం అందుతోంది.
ప్రభాస్ ఆదిపురుష్ లో రాముడి పాత్రలో కనిపించబోతుండగా, సీత పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కృతి సనన్ చేసింది. ఇక రావణుడి పాత్రను బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేశాడు. ఇప్పటివరకు రామాయణం పై ఎన్నో సినిమాలు.. సీరియల్స్ వచ్చాయి. అయినప్పటికీ.. ప్రభాస్ చేస్తున్న ఈ రామాయణం చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు మేకర్స్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ ఆదిపురుష్ ను వచ్చే ఏడాదిలోనే ఆగస్టులో 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. మరి.. ఆదిపురుష్ తో ప్రభాస్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.











