స్వీడిష్‌కు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా.. తదువరి పాటించాల్సిన కార్యాచరణ గురించిన టూల్ కిట్ కూడా షేర్ చేశారు. దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణించిన కేంద్రం తనపై కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన గ్రెటా.. బెదిరింపులకు తను భయపడనని.. ఇప్పటికీ రైతులకు మద్దతు నిలవడంలో నా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం లేదని.. శాంతియుత పోరాటానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొంది.
గ్రెటాపై నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా ఓ కీలక విషయాన్ని తెలుసుకున్నారు పోలీసలు. దీనికి సంబంధించి బెంగుళూరులోని సోలదేవనహల్లికి చెందిన దిశ రవి అనే పర్యావరణ కార్యకర్తను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. గ్రెటా పర్యావరణ పోరాటానికి ఆకర్షితురాలైన ఈ యువతి 2018 ఆగస్టు నుంచి దిశ రవి కూడా భారత్‌లో ఉద్యమాలు చేస్తోంది. అందులో భాగంగానే ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. తాజాగా గ్రెటా పోస్ట్ చేసిన టూల్ కిట్‌ని దిశ ఎడిట్ చేసి తిరిగి పోస్ట్ చేసిసిందని స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించారు.
రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీటిపై మన భారత దేశ ప్రభుత్వం స్పందిస్తూ.. ఇలాంటి విద్వేష పూరితమైనవని, వర్గాలు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. ఇక పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా పోస్ట్ చేసిన టూల్ కిట్‌పై కేసు నమోదు చేసిన స్పెషల్ సెల్ పోలీసులు.. ఆ లింక్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే నేడు బెంగుళూరు యువతిని అదుపులోకి తీసుకున్నారు.










