తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు దెబ్బతిన్న తెలంగాణకు సాయం అందించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందుకొచ్చారు. హైదరాబాద్‌లో సహాయక పునరావాస చర్యల నిమిత్తం రూ.15 కోట్లను అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ ప్రకటించారు.
హైదారాబాద్ నగరాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో హైదరాబాద్ సోదరీ, సోదరీమణులకు ఢిల్లీ ప్రజలు అండగా ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ముంపు సహాయక చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తరుపున రూ.15 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తామని ఢిల్లీ సీఎం ట్విట్టర్‌లో తెలిపారు. అయితే కేజ్రీవాల్ ప్రకటించిన సాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కష్ట సమయంలో తెలంగాణకు అండగా నిలబడిన కేజ్రీవాల్‌కు తెలంగాణ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. రూ.15 కోట్లు ఆర్థిక సాయం చేసి ఎంతో ఉదారతను చాటుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఈరోజు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణకు తమిళనాడు సీఎం రూ.10 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులు, వ్యాపారులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాజకీయ వేత్తలు, సినీ ప్రముఖులు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు.
Floods have caused havoc in Hyderabad. People of Delhi stand by our brother and sisters in Hyderabad in this hour of crisis.
Delhi govt will donate Rs 15 cr to the Govt of Telangana for its relief efforts.
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 20, 2020











