పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని, తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ పదవులను వదిలిపెట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నోముల నర్సింహయ్య వారసుడిగా ఆయన కుమారుడు నోముల భగత్ నాగార్జునసాగర్ ప్రజలకు సేవ చేస్తారని, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు. జానారెడ్డి 30 ఏళ్లుగా ఉన్నా ఒక్క డిగ్రీ కాలేజీ కూడా రాలేదని నర్సింహయ్య కోరిన వెంటనే తాను రెండు డిగ్రీ కాలేజీలు ఇచ్చానని తెలిపారు. తనకు సీఎం పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని మొన్న ఓ నాయకుడు అంటున్నారని, అవకాశం ఉంటే ఆయనే సీఎం అయ్యే వాడు కదా అని అన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసిన నోముల నర్సింహయ్య తనయుడు, విద్యావంతుడైన నోముల భగత్‌ను నిలబెట్టామని, భగత్ గాలి ఇక్కడ బాగానే ఉందని. ఈ విషయాన్ని ఓట్ల రూపంలో తెలిపి భగత్‌ను గెలిపించాలని కోరారు.
Must Read ;- నోముల భగత్ వర్సెస్ రఘువీర్ రెడ్డి : టీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్











