అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న థ్రిల్లర్ మూవీ ‘నిశ్శబ్దం’. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒకప్పుడు పుష్పక విమానం కథను పోలి ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. మరి ఈ సినిమా దర్శకుడు ఆ విషయంలో ఏమంటున్నారో చూద్దాం. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు హేమంత్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
‘పుష్పక విమానం’ సినిమా టైపులో ప్రస్తుత సాంకేతికతను వాడుకొని థిల్లర్ నేపథ్యంగా ఓ ప్రయోగాత్మక సినిమా చేయాలనుకున్నా, అలా పుట్టిందే ఈ ‘నిశ్శబ్ధం’ కథ అని ఆయన తెలిపారు. విజువల్ గ్రాండియర్‌గా కనిపించడంతో పాటు ఆడియెన్స్‌కి కొంతమేర ఫ్రెష్ ఫీల్ రావడానికి ఈ సినిమాను అమెరికన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించామని, అలానే ఈ సినిమాలో అనుష్క కూడా అమెరికన్ బార్న్ ఇండియన్‌గా కనిపించబోతున్నారని తెలిపారు.
అనుష్క గారికి ఉన్న పేరుతో పోల్చుకుంటే నేను చిన్న దర్శకున్ని. అయితే ఆమె మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ప్రతిదీ అడిగి తెలుసుకుని నటించారు. ఈ సినిమా కోసం అమె ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఆ భాష నేర్చుకోవడం చాల కష్టం, అయినా సరే ఆమె పట్టుదలతో నేర్చుకున్నారని వివరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 2, 2020 నుంచి ఎక్స్ క్లూజివ్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా అందుబాటులో ఉంటుంది.











