యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. కానీ ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పలు కోణాలలో విచారించిన ఎన్సీబీ కీలక సమచారాన్ని రాబట్టింది. ఈ కేసులో రియా, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రియా అందించిన సమాచారం మేరకు పలువురు స్టార్ హీరోయిన్స్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ ఉన్నారు. ఇప్పటికే వీరందరూ ఎన్సీబీ ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు డైవర్ట్ అయిందని ఎన్సీబీ విచారణ మాత్రమే జరుగుతుందని సీబీఐ విచారణ జరగడం లేదని విమర్శలు ప్రచారం జరుగుతున్నాయి.
సుశాంత్ ఫ్యామిలీ లాయర్ అనుమానాలు
సుశాంత్ కేసుపై సీబీఐ జరుపుతున్న విచారణపై వారి ఫ్యామిలీ లాయర్ వికాశ్ సింగ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా డ్రగ్స్ కేసులో విచారణ ఎక్కువ జరుగుతుందని సుశాంత్ కేసు డైవర్ట్ అయిందని ఆయన వెల్లడించారు. సుశాంత్ కుటుంబసభ్యులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు వికాశ్ సింగ్ పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రోగ్రెస్ ను సీబీఐ ఇప్పటివరకు చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసుపై విచారణ జరుపుతోంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సీబీఐ బదలాయిస్తూ తీర్పును వెలువరించింది.
సీబీఐ విచారణ
సుశాంత్ కేసును విచారణ జరిపేందుకు సీబీఐ 5 బృందాలను ముంబైలో దింపింది. ఆయా బృందాలు ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించింది. సుశాంత్ అపార్ట్మెంట్ గార్డ్, వంటమనిషి,సిద్దార్థ్ పితాని, సందీప్ సింగ్, రియా చక్రవర్తిలను విచారించారు. సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు సిద్ధం చేసిన శవపరీక్ష నివేదికను పరిశీలించిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ ప్యానల్‌ను కూడా కలవడానికి సీబీఐ సిద్ధంగా ఉంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ – ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ గుప్తా కొన్ని రోజుల కిందట సుశాంత్ మరణంపై హత్యకు అవకాశం లేదని కొట్టిపారేయని సంగతి తెలిసిందే. “మెడికల్ బోర్డు అభిప్రాయం వచ్చే వారం సిబిఐకి ఇవ్వబడుతుంది” అని తెలిపారు. ఎయిమ్స్-సిబిఐ సమావేశం ఇంకా జరగలేదు. కానీ డాక్టర్ చెప్పినట్లు ఈ సమావేశం ఇప్పటి వరకు జరగలేదు.
నిజం నిలకడగా తెలుస్తుంది
నటుడు, సుశాంత్ సింగ్ స్నేహితుడు యువరాజ్ సింగ్ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఫియాన్సీ రోహన్ రాయ్ పట్టుబడితే అది ఈ కేసును పరిష్కరించడానికి సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సుశాంత్ ఆత్మహత్య కంటే ముందు దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె ఫియాన్సీ రోహన్ రాయ్ పై పలు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ కూడా రోహన్ రాయ్ ని అరెస్ట్ చేస్తే ఈ కేసు విచారణ పూర్తవుతుందని చెప్పడం గమనార్హం.
సీబీఐ సుశాంత్ కేసును వేగవంతం చేయాలని కోరారు. సుశాంత్, దిశాల ఆత్మహత్య వెనుక ఎవరు? ఉన్నారనే సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. వారిద్దరి ఆత్మహత్యల కారణమేంటని తేల్చాలంటే రాహుల్ రాయ్ ని అరెస్ట్ చేయాలని అభిప్రాయపడ్డారు. రోహన్ రాయ్ కి నార్కో-ఎనాలిసిస్ చేస్తే చాలు మొత్తం విషయం బయటపడుతుందని వెల్లడించారు. డ్రగ్స్ కోణంతో సుశాంత్ కేసు విచారణ మందగించిందని విమర్శలు ప్రచారం జరుగుతున్నాయి.ఈ విమర్శలపై స్పందించిన యువరాజ్ నిజం నిలకడగా వెలుగులోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంత వరకు ఓపిక పట్టండి అంటూ ఆయన అభిమానులను కోరారు.











