దేశంలో కరోనా కేసులు తగ్గాయి.. సెకండ్ వేవ్ ప్రభావం కూడా అంతంతమాత్రమే‘ అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే కేసులు పెరిగినా.. వైరస్ అంతగా ప్రభావం చూపడం లేదు. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,157 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908కు చేరింది. అలాగే, నిన్న 42,004 మంది కోలుకున్నారు.
మరణాల విషయానికొస్తే… నిన్న 518 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,13,609కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,02,69,796 మంది కోలుకున్నారు. 4,22,660 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 40,49,31,715 వ్యాక్సిన్ డోసులు వేశారు. గత రెండురోజులుగా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ ఆక్సిజన్, బెడ్లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. కరోనా థర్డ్ వేవ్ భయాల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సప్లయ్‌ని మరింతగా పెంచాలని రాష్రాలు వేడుకుంటున్నాయి.