తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతున్నా.. ఈ జిల్లాపై ప్రభావం చూపుతూనే ఉంది. రోజుకు 400 కేసులు నమోదు అవుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. తెలంగాణలో 900 నుంచి 1000 కేసులు నమోదవుతుంటే.. ఒక ఖమ్మం జిల్లాలోనే 400 కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గురువారం 7,549 కరోనా టెస్టులు చేయగా, 400 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి విరుచుకుపడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి.
పిల్లలపై పంజా
కరోనా వైరస్ పెద్దలనే కాదు.. పిల్లలపై ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిపిన ఫీవర్ సర్వేలో లెక్కకు మంచి కేసులు నమోదయ్యాయి. గతనెలలో 21 రోజుల వ్యవధిలోనే 1400 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్, మే నెలలో 1400 మంది పిల్లల మహమ్మారిన పడ్డారు. పసిపిల్లలు కరోనా బారిన పడటం, కనీస వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ లో చికిత్స చేయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. పిల్లల కోవిడ్ ఆస్పత్రిలో సైతం సరైన బెడ్స్ లేకపోవడంతో పసిపిల్లలు కోలుకోని పరిస్థితులు ఉన్నాయి.
రాకపోకలే కారణమా..?
తెలంగాణ, ఏపీలో కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వాలు రాకపోకలకు అనుమతులు ఇచ్చాయి. రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం ఖమ్మం. లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఇతర అవసరాల కోసం ఏపీ ప్రజలు ఖమ్మం వస్తున్నారు. ఖమ్మం నుంచే రైతులకు విత్తనాలు అందుతాయి. ఈ నేపథ్యంలో భారీగా రాకపోకలు జరుగుతుండటంతో కేసులు నమోదవుతున్నాయి. మద్యానికి, వైద్యానికి కూడా ఖమ్మం జిల్లాకే వస్తుంటడం కూడా కేసుల పెరుగుదలకు దారి తీస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- కొవిడ్ బెడ్స్ ఖాళీ.. సాధారణ సేవలు షురూ..!











