ఓ పెద్ద హీరో సినిమా ఓటీటీలో విడుదలవుతుందంటే అందరి దృష్టీ అటే ఉంటుంది. ఇప్పుడు అందరి అటెన్షన్ నాని వైపే ఉంది. ఇక టెన్షన్ పడాల్సింది నానినే. సినిమా విడుదలవుతుందంటే చాలు రివ్యూల పేరుతో చీల్చి చెండాడటానికి సామాజిక మాధ్యమాలు రెడీగా ఉంటాయి. కానీ నానిలో మాత్రం ఎలాంటి టెన్షన్ కనిపించడం లేదు. వి ఫలితం పైనా మిగతా సినిమాల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
ఇది సక్సెస్ అయి అందరూ లాభపడితే వరుసగా మిగతా సినిమాలు ఓటీటీ క్యూలో నిలబడక తప్పదు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ మీద నాని దృష్టి పెట్టాడు. సినిమాకి సంబంధించి పాటలు విడుదల చేయడం, ఇంటర్వ్యూలను వెబనార్ ద్వారా నిర్వహించడం చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు, నివేదా థామస్ ల మధ్య వచ్చే ఓ మెలోడీ సాంగ్ ‘వచ్చేస్తున్న వచ్చేస్తున్నా’ను ఈరోజు విడుదల చేశారు. శేయా ఘోషల్, అమిత్ త్రివేది ఈ పాటకు జీవం పోశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటను రాశారు.
ఈ సినిమా ఓ పోలీసుకూ, ఓ కిల్లర్ కూ మధ్య సాగే పిల్లి, ఎలుక పోరాటం కథాంశంగా తెరకెక్కింది. నెగిటివ్ రోల్ లో నానికి ఇది మొదటి చిత్రం. పైగా ఆయనకు 25వ సినిమా. దాదాపు 200 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఈ సినిమాను సెప్టెంబరు 5నుంచి చూడవచ్చు. సినిమా రివ్వ్యూల కోసం కాచుకు కూర్చున్నారు విమర్శకులు. ఈ విషయంలో నాని ఎలాంటి టెన్షన్ పడదలుచుకోలేదు. సినిమా మీద తనకు ఎంతో నమ్మకం ఉందని, అందరూ వి సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆయన నమ్మకంతో చెబుతున్నారు.