ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ అలాగే కొనసాగుతోంది. శనివారం ఉదయానికి గత 24 గంటల్లో 10,548కేసులు బయటపడ్డాయి. మొత్తం 62,024 మందికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 82 మంది కొవిడ్ దెబ్బకు కన్నుమూశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మరణించడం గమనార్హం.












