కరోనా సెకండ్ వేవ్ విజృంభణ మామూలుగా లేదు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎంతటి వారైనా కరోనా తాకిడికి తల వంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నటికి నిన్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె డాక్టర్స్ సూచనలతో హోమ్ ఐసోలేషన్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారిన పడడం అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
Akshay Kumar Tested Covid-19 Positive :
తనకి కరోనా సోకిన సంగతి స్వయంగా అక్షయ్ కుమారే తన ట్వీట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించాడు. ‘నేను ఉదయాన్నే కరోనా టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్ వచ్చింది. కోవిడ్ నిబంధనల్ని అనుసరించి.. నేను వెంటనే హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళాను. స్వీయ నిర్బంధంలో ఉంటున్నాను. నాతో గతరోజులుగా కాంటాక్ట్ లో ఉన్నవారు దయచేసి కరోనా టెస్ట్ చేయించుకొని జాగ్రత్తగా ఉండవల్సింది గా కోరుకుంటున్నాను. త్వరలోనే నేను మళ్ళీ యాక్షన్ లోకి వస్తాను’ .. అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు.
Also Read : బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు కరోనా పాజిటివ్