కరోనా సేకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రోజురోజుకూ కేసుల పెరిగిపోతుండటంతో దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లనే లక్ష కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత పాజిటివ్ కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదుకావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబరు 17న అత్యధికంగా 97 వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం ఆ రికార్డును తాజా కేసులు అధిగమించాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 103,794 కేసులు నమోదుకాగా.. మరో 477 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితులు సంఖ్య 1,25,87,921కు చేరగా.. కోవిడ్ మరణాలు 1,65,961కి చేరాయి.
Must Read ;- కరోనా రికార్డు : ఒక్కరోజు ఇండియాలో ఇన్ని కేసులా..