ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతూ ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికే విధించిన కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగించింది. తొలుత ఈనెల 5న కర్ఫ్యూ ప్రకటించారు.ముందుగా నిర్ణయించిన ప్రకారం రేపటితో కర్ఫ్యూ ముగియనుంది.దీంతో సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.కరోనా కట్టడికి కర్ఫ్యూ సమయాన్ని కూడా తగ్గించాలని కొందరు అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.అయితే నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని సీఎం భావించారు.దీంతో ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
అనంతపురంలో అలజడి..
అనంతపురం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఒకే రోజు 3500 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరుకు ఉద్యోగ, ఉపాధి, కూలీ పనులకు వెళ్లిన అనంతపురం జిల్లా వాసులు పెద్ద ఎత్తున తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకోవడంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా వ్యాపిస్తోన్న టాప్ 5 జిల్లాల్లో అనంతపురం నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
Must Read ;- ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు











