ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన డిజిటల్ వాల్యూషన్పై అభ్యర్థులు వ్యక్తం చేస్తోన్న అనుమానాలు నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి..2018లో జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్‌కు మెయిన్స్ రాత పరీక్ష గత ఏడాది డిసెంబర్లో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు.దాదాపు 7000 మంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూ రౌండ్‌కు స్పోర్ట్స్ కోటాతో కలిపి 340 మంది ఎంపికయ్యారు.ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు సబ్ కలెక్టర్లుగా, ఆర్డీవోలుగా, ఉన్నతాధికారులుగాను సేవలందిస్తారు కాబట్టి, పరీక్షా విధానo పారదర్శకంగా, న్యాయంగా, లోపాలు, పక్షపాతం లేకుండా ఉండటం చాలా ముఖ్యమన్నారు. పరీక్షలకు సంబంధించిన వాల్యూషన్ సక్రమంగా జరగలేదనే ఫిర్యాదులు అనేకం వచ్చాయని తెలిపారు. మాన్యువల్ వాల్యూషన్ చేయడం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్దతిలో చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.వచ్చే నెలలో ఇంటర్వ్యూల రౌండ్ ప్రారంభం కానున్నందున అభ్యర్థుల తరఫున 5 డిమాండ్లు మీ ముందు ఉంచుతున్నానని పేర్కొన్నారు..
ఐదు డిమాండ్లు ఇవే..
మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్ వాల్యూషన్ చేయాలి.
ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అందరి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలి. ఇది వారి తదుపరి ప్రయత్నం కోసం, లోపాలు సరిచేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
డిజిటల్ వాల్యూషన్కి సంబంధించిన సాంకేతికత SOP పై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి.
ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జవాబు పత్రాలను విడుదల చేయాలి
ఎంపిక ప్రక్రియ,వాల్యూషన్పై అనుమానాలున్న వారి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
కోవిడ్-19 వైరస్ సాకుతో గ్రూప్1 పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక, విధానపరమైన, చట్టపరమైన పద్ధతులను విస్మరించడం తగదని లేఖలో పేర్కొన్నారు.