కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, దానికి తగ్గట్టుగా అమలు చేశారు. అందుకే ఢిల్లీలో పాజిటివ్ రేటు చాలా తక్కువగా నమోదు అవుతోంది. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. థర్డ్ వేవ్ ప్రభావం యూకేలో ఉందని, అక్కడ కేసులు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇండియా అలర్ట్ గా ఉండాలని అన్నారు. దేశంపై థర్డ్ వేవ్ ప్రభావం ఉండే అవకాశం ఉందని, ఒకవేళ వచ్చినా.. కలిసికట్టుగా ఎదుర్కొవడానికి ఢిల్లీ సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Mjust Read ;- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రఘురామరాజు లేఖ










