తమిళ హీరో, రజినీకాంత్ అల్లుడు ధనుష్ కు సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. హాలీవుడ్ నటులతో ఆయన జతకడుతున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం ఈ భారీ ప్రాజెక్టు ముస్తాబవబోతోంది. ‘ది గ్రే మ్యాన్’ పేరుతో రూపొందే ఈ చిత్రంలో హాలీవుడ్ దిగ్గజాలు ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్ కూడా నటిస్తున్నారు. ఈ ముగ్గురు దిగ్గజాలతో ఈ మల్టీస్టరర్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతోంది. రూసో బ్రదర్స్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా 2022లో ప్రథమార్థంలో నెట్ ఫ్లిక్స్ లో డైరెక్టుగా విడుదలవుతుంది.
ఇందులో ధనుష్ పాత్ర ఎలాంటిది అనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ధనుష్ కు సంబంధించి 45 రోజుల షూటింగ్ ఉంటుందట. మంచి యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోంది. హీరోయిన్ గా అనా డి అర్మాన్ కూడా ఖరారైంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఓటీటీ కంటెంట్ కీలక పాత్ర పోషించబోతోందన్నదానికి ఇదే సంకేతం. ఇతర హీరోలు కూడా ధనుష్ బాటలో పయనించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Must Read ;- ధనుశ్ మరో హిట్ కొట్టడం ఖాయమంటున్న ఫ్యాన్స్